Custom duty on Medicines : కేంద్ర బడ్జెట్ (Union Budget) లో మొత్తం 36 రకాల ఔషధాల (Medicines) పై 100 శాతం పన్ను మినహాయింపునిచ్చారు. దాంతో రోగులపై ఆర్థిక భారం తగ్గనుంది. అత్యవసరమైన చికిత్సలకు ఖర్చును తగ్గించే లక్ష్యంతో 36 రకాల ఔషధాలపై 100 శాతం కస్టమ్ డ్యూటీ మినహాయింపును ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తన 2025-26 బడ్జెట్ (Budget 2025-26) ప్రసంగంలో పేర్కొన్నారు.
ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఈ కస్టమ్ డ్యూటీ మినహాయింపుతో అధిక ప్రయోజనం కలుగనుంది. 2024 ఫిబ్రవరిలో కూడా ప్రభుత్వం మూడు రకాల క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీని రద్దు చేసింది. జీఎస్టీ రద్దయిన ఔషధాల్లో Trastuzumab Deruxtecan, Osimertinib, Durvalumab ఉన్నాయి. 36 రకాల ఔషధాలపై కస్టమ్ 100 శాతం కస్టమ్ డ్యూటీ మినహాయింపుతోపాటు మరో ఆరు రకాల వ్యాధులకు సంబంధించిన ఔషధాలపై రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
వాటిలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకు వినియోగించే ఔషధాలు, అరుదైన వ్యాధులకు అవసరమయ్యే ఔషధాలు, తీవ్ర అనారోగ్యాలకు సంబంధించిన ఔషధాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Budget 2025 | ఉద్యోగులకు ఊరట కలిగేనా.. ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై పదేళ్లుగా వివక్ష!
Union Budget | సీతమ్మ కరుణించేనా? పసుపుబోర్డుకు పైసలిచ్చేనా?
Gas Cylinder Price | బడ్జెట్‌కు ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర