Viral Video : ఇండియన్ రైల్వేస్ (Indian Railways) చెందిన ఓ రైల్లో ఆ రైల్లోని ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (Trian Ticket Examiner-TTE) కు, ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓ టీటీఈ ప్రయాణికుల నుంచి లంచాలు తీసుకుంటూ కనిపిస్తున్నాడు. కావాల్సిన చోట సీటు, బెర్తు ఇస్తానంటూ అతను పలువురు ప్రయాణికుల నుంచి లంచాలు వసూలు చేస్తుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు.
అయితే తాను లంచాలు తీసుకుంటుండగా పైబెర్తులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీస్తుండటాన్ని టీటీఈ గమనించాడు. వెంటనే ‘విధి నిర్వహణలో ఉన్న టీటీఈని వీడియో తీస్తావా..?’ అని నిలదీశాడు. ‘డ్యూటీలో ఉన్న టీటీఈని వీడియో తీస్తే ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది తెలుసా..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ‘ఆ రూల్ ఎక్కడుందో చూపించు..’ అని ప్రయాణికుడు నిలదీయడం, ‘చూపిస్తా.. చూపిస్తా..’ అని టీటీఈ ఆగ్రహంతో చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డ్యూటీలో ఉన్న టీటీఈని వీడియో తీస్తే నిజంగానే ఏడేళ్ల జైలుశిక్ష పడుతుందా..? అనే విషయంలో చర్చ జరుగుతోంది. చట్టంలో అలాంటిదేమీ లేదని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కడంతో ఫ్రస్టేషన్లో టీటీఈ అలా మాట్లాడి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా టీటీఈ, ప్రయాణికుడికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
Kalesh inside indian Railways b/w TTE and Passenger over TTE got caught giving seats to passengers by taking money (full Context in the clip) pic.twitter.com/TH1E1S0bVn
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 1, 2025
Mahakumbh | మహా కుంభమేళాలో 77 దేశాల దౌత్యవేత్తల బృందం సందడి.. Video
Anna Beatriz | పోర్న్ సీన్ షూటింగ్ అనంతరం బిల్డింగ్పై నుంచి పడి స్టార్ నటి మృతి..!
Custom duty | కేంద్ర బడ్జెట్.. 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు