WI vs IND : భారత్కు వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్లోనే బ్రేకిచ్చాడు. పవర్ ప్లే తర్వాత బిగ్ షాట్లు ఆడాలనుకున్న షాయ్ హోప్(32)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ ఆడాలనుకున్న హోప్ బంతిని అంచనా వేయలేక బౌల్డయ్యాడు. దాంతో.. 68 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని మిస్టరీ స్పిన్నర్ విడదీశాడు. ప్రస్తుతం రోస్టన్ ఛేజ్(36), షిమ్రన్ హిట్మైర్(1) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 69-1.
Castled ⚡️
Varun Chakaravarthy with the opening breakthrough 😎
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvWI | @chakaravarthy29 pic.twitter.com/Nbrao0e9ox
— BCCI (@BCCI) March 1, 2026
సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్లో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారు. వెస్టిండీస్ ఓపెనర్లకు దంచేందుకు అవకాశమివ్వడం లేదు. దాంతో.. ఆచితూచి ఆడిన షాయ్ హోప్(25 నాటౌట్), రోస్టన్ ఛేజ్(20 నాటౌట్)లు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు. ఫలితంగా.. పవర్ ప్లేలో విండీస్ వికెట్ కోల్పోకుండా 45 రన్సే చేయగలిగింది.