డీలిమిటేషన్‌కు డీఎంకే మద్దతు
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తమిళనాడులోని డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ప్రక్రియకు తాజాగా మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన బిల్లులో తమ ప్రధాన డిమాండ్లకు చోటు కల్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. దీంతో 22 మంది లోక్‌సభ ఎంపీలున్న డీఎంకే మద్దతు కేంద్రానికి కీలకంగా మారింది.
- మారిన రాజకీయ సమీకరణలు
- కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీకి బలం!
- బిల్లుపై ‘ఇండియా’లో విభేదాలు
చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తమిళనాడులోని డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ప్రక్రియకు తాజాగా మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన బిల్లులో తమ ప్రధాన డిమాండ్లకు చోటు కల్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. దీంతో 22 మంది లోక్‌సభ ఎంపీలున్న డీఎంకే మద్దతు కేంద్రానికి కీలకంగా మారింది.
శనివారం చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో బిల్లుకు మద్దతుగా తీర్మానించారు. రాష్ర్టాల మధ్య లోక్‌సభ స్థానాల ప్రస్తుత నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని, తమిళనాడుకు ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని డీఎంకే కోరింది. ఈ రెండు అంశాలకు సవరించిన బిల్లులో చోటు లభించిందని స్టాలిన్ తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు డీఎంకే మద్దతు తెలిపింది. ప్రస్తుతం తమిళనాడుకు ఉన్న 39 స్థానాలు ప్రతిపాదన ప్రకారం 59కి పెరగనున్నాయి. అయితే రాష్ట్ర ప్రస్తుత ప్రాతినిధ్య వాటా తగ్గకూడదని పార్టీ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

