Idly Kadai | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇడ్లీ కడై (IdlyKadai). DD4 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీలో నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆకాశ్ (డెబ్యూ) నిర్మిస్తున్నారు. కాగా ఇందులో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని.. ఇడ్లీకడైలో విలన్‌గా కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా రిలీజ్ అప్డేట్ పోస్టర్‌తో క్రేజీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అరుణ్ విజయ్, ధనుష్ బాక్సింగ్ రింగ్‌లో కనిపిస్తున్నారు. ధనుష్ చేతిలో ప్లాస్క్ పట్టుకుని కనిపిస్తుంటే.. అరుణ్ విజయ్ బాక్సింగ్ గ్లౌజులు పెట్టుకొని కొంచెం సీరియస్‌గా కనిపిస్తుండటం చూడొచ్చు.
ఇంతకీ ధనుష్ ఏమైనా కోచ్ కనిపించబోతున్నాడా..? ఇంతకీ సినిమాలో తన పాత్రలో ఎలా డిజైన్ చేసుకున్నాడు.. అరుణ్ విజయ్ను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇడ్లీ కడై షూటింగ్ రామనాథపురంలో కొనసాగుతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్.
ఇప్పటికే పొంగళ్ లుక్స్‌లో.. ఒక పోస్టర్లో ధనుష్, నిత్యమీనన్ చేనులో నిలబడి వర్షంలో తడిసి ముద్దవుతుండగా.. మరో పోస్టర్లో తెలుపు రంగు చొక్కా, లుంగీలో మర్రి చెట్టు కింద లేగదూడను పట్టుకొని కూర్చుండటం చూడొచ్చు. అయితే ధనుష్ ఈ సారి రిలీజ్ అప్డేట్ పోస్టర్లో మాత్రం రింగ్‌లో కనిపిస్తుండటంతో నెట్టింట క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోతుంది.
తిరు సినిమా తర్వాత నిత్యమీనన్, ధనుష్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇడ్లీ కడై రిలీజ్ అప్డేట్ పోస్టర్..
The lid is OFF 🌬️
The heat is ON♨️Welcoming the Power-Packed @arunvijayno1 sir to our #IdlyKadai @dhanushkraja @RedGiantMovies_ @gvprakash @menennithya @aakashbaskaran @thesreyas @wunderbarfilms @dawnpicturesoff@MShenbagamoort3 @kavya_sriram@Kiran10koushik… pic.twitter.com/FZgewW1zRS
— Red Giant Movies (@RedGiantMovies_) February 1, 2025
A Film by @dhanushkraja ❤️🔥#IdlyKadai pic.twitter.com/jNFFGgAVnu
— VɑɑTHI ツ (@Dharun__Offl) February 1, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం