Yoga day | మెట్పల్లి, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగా దినోత్సవంలో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఒక రోజు కాకుండా ప్రతీరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు.
యోగా గురువు డాక్టర్ రాజరత్నాకర్ న్యాయవాదుల చేత యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఉచితంగా ప్రతిరోజు యోగా నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం యోగా గురువును న్యాయమూర్తులు, న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సి విల్ కోర్టు జడ్జి అరుణ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంటి మోహన్ రెడ్డి ,ఉపాధ్యక్షుడు రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు