Talasani Srinivas Yadav | డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతూ మార్గమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 20 వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ సభ ఘనంగా జరుగుతదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు.. ప్రజల్లోకి రావడలేదని పదేపదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ బయటకు వస్తుండు అంటే వణికిపోతున్నారు . కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతు బంధు నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకు..? అని ప్రశ్నించారు.
పదేండ్ల కేసీఆర్ పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. రైతులకు పంట పెట్టుబడి క్రింద ఎకరానికి రూ.10 వేలు చొప్పున రైతుబంధు సాయం అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు కేసీఆర్ ప్రభుత్వం అందించింది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకొని పని చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
కేసీఆర్ అప్పులు చేశారని విమర్శించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో 3.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి రిజర్వాయర్లను నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. జిల్లాకు ఒక కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లాకో మెడికల్ కాలేజీలు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక హామీల అమలును మరిచిందన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కరికైనా ఇచ్చారా..? మహిళలకు నెలకు రూ.2500 ఆర్ధిక సహాయం ఇస్తామన్నారు.. ఏమైంది ? అని ప్రశ్నించారు.
Pahalgam attack | పహల్గాం దాడికి ఏడాది.. పాక్ తీవ్రవాదంపై అమెరికాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భారత్
Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్‌లో బైక్ ర్యాలీ
Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?