Indiramma Houses | సారంగాపూర్, ఆగస్టు 6 : ప్రభుత్వ నింబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీఓ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఇండ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని.. ఇండ్ల నిర్మాణాలకు దశల వారిగా ప్రభుత్వం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో వేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హేమలత, మాజీ వైస్ ఎంపిపి కొండ్రా రాంచందర్ రెడ్డి, కోటి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, లింగన్న, నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
Motkur : తెలంగాణ ఉద్యమ వైతాళికుడు జయశంకర్ సార్ : దూళిపాల ధనుంజయ నాయుడు
Raj B Shetty | పెద్ద స్టార్లతో నటిస్తే ఇబ్బందులు పడాలి.. రాజ్ బీ శెట్టి కామెంట్స్ వైరల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి : ఓరుగంటి రమణారావు