మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే విషయంలో అందరికంటే ఓ అడుగు ముందే ఉంటారు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే ఆయన చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్, రామ్, వరుణ్‌తేజ్‌లతో కలిసి సినిమాలు చేశారు. త్వరలో మరో స్టార్ హీరోతో ఆయన తెరను పంచుకోబోతున్నారు. ఆ హీరోనే నందమూరి కల్యాణ్‌రామ్. హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనిల్ మార్క్ క్లీన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనున్నదని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ సినిమా నిర్మాతలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.