సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): సిటీలో ఎటు చూసినా.. ట్రాఫిక్ జామ్.. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు త్వరగా వెళ్లలేని పరిస్థితి.. వాహనదారులు అల్లాడిపోతున్నారు.. కొద్ది దూరం ప్రయాణించాలన్నా.. ఆగి ఆగి వెళ్లాల్సిందే.. గమ్యం చేరే వరకు ఆపసోపాలు పడాల్సిందే.. నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు నిలువుటద్దాలివి. ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్ల వసూళ్లపై పెడుతున్న దృష్టి వాహనాల క్రమబద్ధీకరణపై పెట్టడం లేదని, దీనివల్ల ఇబ్బందులు మరింత రెట్టింపవుతున్నాయని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గురువారం ఐకియా రోడ్డులో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు అవస్థలను చిత్రంలో చూడొచ్చు.