Road accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోఇ వెళ్తే.. ప్యాసింజర్ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ప్రమాదంలో మరణించిన వారు బాడంగి మండలం గజరాయనివలస గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.