బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30 : పోషక విలువలున్న ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారని బూర్గంపహాడ్ సీడీపీవో తార అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ రైతు వేదికలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీడీపీవో తార మాట్లాడుతూ పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేస్తుందని, దీనిని తల్లులు, గర్భిణులు, చిన్నారులకు క్రమం తప్పకుండా అందించాలన్నారు. గర్భిణులు, తల్లులు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నగేష్, ఉప సర్పంచ్ పొక్కుల రవి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు.