Mutton shops : మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 2న మద్యం, మాంసం దుకాణాలను బంద్ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అన్ని మాంసం విక్రయశాలలను, మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీచేశారు.
అధికారుల ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలతోపాటు అన్ని రకాల రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను అక్టోబర్ 2న పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ చట్టం-1955 లోని సెక్షన్ 533 (బి) ప్రకారం.. స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టంచేశారు.
ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు తమ సిబ్బందికి సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను జీహెచ్ఎంసీ కోరింది.