-ట్రాన్స్కో ఏఈ గుర్రం ఉపేందర్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30 : గృహ విద్యుత్ వినియోగదారులు సూర్య సేతును సద్వినియోగం చేసుకోవాలని సారపాక ట్రాన్స్ కో ఏఈ గుర్రం ఉపేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద గృహ విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రభుత్స సబ్సిడీ, సౌర విద్యుత్ ప్రయోజనాలపై అక్టోబర్ 1, 2 తేదీల్లో భద్రాచలం డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించే ‘సూర్య-సేతు’ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండలంలోని వినియోగదారులు, సారపాక సెక్షన్ వినియోగదారులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అవగాహన కార్యక్రమం ట్రాన్స్కో డీఈ జీవన్ కుమార్ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులందరూ సౌర విద్యుత్ ఏర్పాటు, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు తదితర వివరాలపై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు.