World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
World Cup : ఇండియాలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ జట్టు దూరంగా ఉండనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనడం లేదని ఆ దేశానికి చెందిన పీవీసీఏ (పాకిస్తాన్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్) వెల్లడించింది.
World Cup : ఇండియాలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ జట్టు దూరంగా ఉండనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనడం లేదని ఆ దేశానికి చెందిన పీవీసీఏ (పాకిస్తాన్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్) వెల్లడించింది. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందించింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాలో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఆ దేశ విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది.
అయితే, ఇండియాలో జరిగే టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి అనుమతివ్వడం లేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ తెలిపారు. దీంతో పాక్ జట్టు ఈ పర్యటనకు రావడం లేదు. ఇండియాలో ఇంటర్నేషనల్ మాస్టర్స్ క్రికెట్ వరల్డ్ కప్ వచ్చే జనవరిలో జరగాల్సి ఉంది. ఇది 50 ఓవర్ల క్రికెట్. రెండేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. చివరగా గత ఏడాది శ్రీలంకలో ఈ టోర్నీ జరిగింది. ఈసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచుల నిర్వహణ అంశం ఇంకా సందిగ్ధంగానే ఉంది.
పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత్ ఏమాత్రం సుముఖంగా లేదు. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇండియా రావడానికి సిద్ధంగా లేదు. ఇరు జట్లూ తటస్థ వేదికలపై మాత్రమే మ్యాచులు ఆడుతున్నాయి. రాబోయే టోర్నీకి సంబంధించి పాకిస్తాన్ పర్యటించడం లేదని పీవీసీఏ చీఫ్ ఫవాద్ ఇజాజ్ తెలిపారు. ఇజాజ్ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టుకు వీసాలు మంజూరు చేస్తామని, ఉన్నతస్థాయి అదనపు భద్రత కల్పిస్తామని ఇండియా హామీ ఇచ్చిందని వెల్లడించారు. అయితే, తమ జట్టు ఇండియాలో పర్యటించేందుకు పాక్ ప్రభుత్వం అనుమతివ్వలేదని తెలిపారు.
దీంతో తమ జట్టు స్థానంలో మరో జట్టును తీసుకోవాల్సిందిగా టోర్నీ నిర్వాహకులకు సూచించినట్లు వివరించారు. క్రికెట్ టీంతోపాటు పాక్ హాకీ టీం కూడా ఇండియాలో పర్యటించేందుకు విముఖత వ్యక్తం చేసింది. హాకీకి సంబంధించి ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో జరగాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి టోర్నీ ప్రారంభం కావాలి. అయితే, ఈ టోర్నీలో పాల్గొనడం లేదని పాకిస్తాన్ హాకీ సమాఖ్య తెలిపింది. దీంతో పాక్ స్థానంలో బంగ్లాదేశ్ జట్టుకు స్థానం కల్పిస్తూ టోర్నీ నిర్వహించేందుకు ఇండియా సిద్ధమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

