Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Muskan Rastogi : బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ మీరట్ జైలులోనే ఉన్నారు.
Muskan Rastogi : బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ మీరట్ జైలులోనే ఉన్నారు. వీరిలో ముస్కాన్ రస్తోగికి 10 నెలల చిన్నారి ఉంది. రస్తోగి జైలులో ఉండటం, ఆమెకు మరణ శిక్ష పడిన నేపథ్యంలో చిన్నారి భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముంబైకి చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముందుకొచ్చాడు.
అతడి పేరు ఫైజాన్ అన్సారి. అతడు చిన్నారి దత్తత కోరుతూ ఉత్తర ప్రదేశ్, మీరట్ కోర్టులో అతడు పిటిషన్ దాఖలు చేశాడు. మంచి వాతావరణంలో పాపను ఎదిగేలా చూస్తానని, తన జీవితంలోని చేదు ఘటనలకు దూరంగా పెంచుతానని కోర్టుకు తెలిపాడు. చిన్నారి తల్లి జైలులో ఉండటం వల్ల పాపకు ఇబ్బంది లేకుండా బాధ్యతాయుతమైన, భద్రత కలిగిన భవిష్యత్‌ను అందిస్తానన్నాడు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదన్నాడు.
చిన్నారి విషయంలో ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అన్సారి పిటిషన్‌పై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. కోర్టు ఇందుకు అంగీకరించి, తల్లి కూడా అనుమతిస్తే అప్పుడు ఆ చిన్నారిని దత్తత తీసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం తల్లి ముస్కాన్, ఆమె 10 నెలల చిన్నారి కూతురు జైలులోనే ఉన్నారు.
ఇదీ బ్లూ డ్రమ్ మర్డర్ కేసు
మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అనే అతడు లండన్‌లో మర్చంట్ నేవీ అధికారిగా పని చేసేవాడు. అతడు 2025 ఫిబ్రవరిలో లండన్ నుంచి ఇండియా (మీరట్) వచ్చాడు. అతడిని మార్చి 3, 2025 రాత్రి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని బ్లూ డ్రమ్‌లో ఉంచి, పైనుంచి సిమెంట్ పోసి కప్పేశారు. తర్వాత బ్లూ డ్రమ్‌ను ఇంటి పరిసరాల్లో పాతేశారు. పోలీసుల విచారణలో ఈ నేరం బయటపడింది. ఈ కేసు విచారణ పూర్తికాగా అక్టోబర్ 14న మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. రస్తోగి, సాహిల్ శుక్లా మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగింది. వారి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. రస్తోగికి ఇంతకుముందే ఏడేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారి ప్రస్తుతం రస్తోగి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

