Israel PMs | మేకప్స్, హెయిర్ స్టైల్స్ కోసం కోట్లలో ఖర్చుపెడుతున్న ఇజ్రాయెల్ ప్రధానులు..!
Israel PMs | ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు (Israel PMs) తమ మేకప్ (Makeup) కోసం, జుట్టు స్టైల్ (Hair style) కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. గత ఏడేళ్ల నుంచి మేకప్‌లు, హెయిర్ స్టైల్స్ కోసం వారు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నుంచి 2026 ఆగస్టు మధ్య కాలంలో సుమారు 4.7 లక్షల డాలర్లు (దాదాపు రూ. 4.49 కోట్లు) ఈ అవసరాల కోసం వెచ్చించారు.
Israel PMs : ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు (Israel PMs) తమ మేకప్ (Makeup) కోసం, జుట్టు స్టైల్ (Hair style) కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. గత ఏడేళ్ల నుంచి మేకప్‌లు, హెయిర్ స్టైల్స్ కోసం వారు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నుంచి 2026 ఆగస్టు మధ్య కాలంలో సుమారు 4.7 లక్షల డాలర్లు (దాదాపు రూ. 4.49 కోట్లు) ఈ అవసరాల కోసం వెచ్చించారు. ఇందులో ఏకంగా 90 శాతం ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu), ఆయన భార్య సారా నెతన్యాహు (Sara Nethanyahu) మేకప్, హెయిర్ స్టైల్ కోసం ఖర్చు కావడం గమనార్హం.
సమాచార స్వేచ్ఛ ఉద్యమం తరఫున న్యాయవాది యారా వింక్లర్-షాలిట్ దాఖలు చేసిన అభ్యర్థనతో ఈ వివరాలు బయటకు వచ్చాయి. ప్రధానమంత్రి కార్యాలయం నెలల తరబడి ఈ సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించినా, చివరికి చట్టపరమైన ఒత్తిడితో వెల్లడించాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘యెడియోట్ అహ్రోనోత్’ ప్రచురించిన కథనం ఆధారంగా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈ వ్యవహారాన్ని రిపోర్ట్ చేశాయి. నెతన్యాహు హయాంలో ఈ ఖర్చులు విపరీతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు ఈ ఖర్చు 2023లో 1.03 లక్షల డాలర్లుగా ఉండగా.. 2025లో 1.11 లక్షల డాలర్లకు చేరింది. అదే సమయంలో, 2022లో మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యాయిర్ లపిడ్ ఇద్దరూ కలిపి కేవలం 27,600 డాలర్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ వ్యత్యాసం నెతన్యాహు దంపతుల తీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గాజాతో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ నెతన్యాహు దంపతులు తమ వ్యక్తిగత గ్రూమింగ్‌పై ఖర్చు చేయడం వివాదాస్పదంగా మారింది.
2023 అక్టోబర్ 7 దాడుల తర్వాత నెతన్యాహు దంపతుల మేకప్ ఖర్చు పెరిగింది. వారు 2023 సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలో జుట్టు స్టైలింగ్ కోసం సుమారు 2,600 డాలర్లు, మేకప్ కోసం 1,580 డాలర్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. విదేశీ పర్యటనల్లోనూ ఈ మేకప్ ఖర్చులు భారీగానే ఉన్నాయి. 2025లో వాషింగ్టన్ పర్యటనకు 13,500 డాలర్లు, 2024లో మరో పర్యటనకు 11,500 డాలర్లు జుట్టు, మేకప్ కోసమే వెచ్చించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఈ వివరాలను ఆలస్యంగా వెల్లడించింది. అంతేగాక ‘రాష్ట్ర భద్రత’ కారణం చూపుతూ హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టుల పేర్లను తొలగించింది. నగలు, వ్యక్తిగత దుస్తుల వంటి ఇతర ఖర్చుల వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ అంశంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

