Road Works | సారంగాపూర్, జూలై 1 : సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామ శివారులోని మ్యాడారం తండా గ్రామం నుండి రాయికల్ మండలంలోని తాట్లవాయ్ కైరి గూడెం వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో మ్యాడారం తండా గ్రామ సర్పంచ్ భుక్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ రైతులు, నాయకులు రహదారి మరమ్మత్తులు చేపట్టారు.
ఈ రహదారి తారురోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వంలో రూ, 1.40 కోట్లు నిధులు మంజూరు అయిన అటవి అనుమతులు రాక ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ రహదారి పనులు ప్రారంభం కాలేదు. పలుమార్లు అటవి శాఖ ఉన్నతాధికారులు రహదారిని పరిశీలించి వివరాలు తెల్సుకున్నప్పటికి రహదారి నిర్మాణానికి ఇప్పటికి అనుమతులు మంజూరు కాలేదు.
మ్యాడారం తండా గిరిజనులు ఈ రహదారిపై పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ఇప్పట్లో ఈ రహదారి పనులు ప్రారంభం అయ్యేలా లేవని గ్రామ రైతులు, నాయకులు ఏకమై సుమారు రూ. 3 లక్షల వ్యయంతో ట్రాక్టర్లతో మొరం తీసుకువచ్చి కిలో మీటర్ మేర పోసి రహదారి మరమ్మత్తులు చేపట్టారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి తారురోడ్డు నిర్మాణం చేపట్టేలా తగిన చర్యలు తీసుకుని ఇబ్బందులు తొలగించాలని మ్యాడారం తండా తాజామాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, గిరిజనులు, నాయకులు, రైతులు వేడుకుంటున్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!