Jeevan Reddy | పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరంగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంపుకోవడం మామూలు విషయం కాదు కదా. ఎంత సఫకేషన్ ఉంటే.. హ్యుమిలియేషన్ ఉంటే ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తదన్నారు.
చేసేదంత చేసుకుంట మళ్లీ శ్రీరంగనీతులు చెప్తున్నారు. నా బాధ నాకుంటది కదా. నాకు గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను. దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. తాను ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే ఉన్నానని.. కాంగ్రెస్‌ను వదిలిపెట్టడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమవుతారన్నారు. సంజయ్‌ను ఎవరు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్‌లోని మిత్రులు ఈ విషయంలో మాట్లాడుతున్నారు. నాకు కార్యకర్తల అభిప్రాయాలు ముఖ్యం. కాంగ్రెస్ అధిష్టానంది కూడా బాధ్యతేనన్నారు.
నేను పార్టీని వీడటంలో సంజయ్‌ది ఒక్కటే పాత్ర కాదు.. ఆరు గ్యారంటీల అమలులో జాప్యం ఉంది. ప్రజల్లో అసంతృప్తి ఉంది. నేను పార్టీని వీడితే పార్టీ ఆగుతుందా..? ఒక్కడు పోతే ఆగదు. కాంగ్రెస్‌లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను దూరం పెట్టడమే పరిష్కారమార్గం.. పార్టీ వారిని దూరం పెడుతుందా..? అలా అయితే కాంగ్రెస్‌లో సమస్యకు పరిష్కార మార్గం వచ్చినట్టేనని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
40 ఏళ్ల బంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాలంటే ఎంత హ్యుమిలియేషన్, ఎంత సఫకేశన్కు గురయ్యి ఉంటాను
చేసేవన్నీ చేసి శ్రీరంగనీతులు చెప్తున్నారు – మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి డి https://t.co/ZAqTCQY6bp pic.twitter.com/W8qBAOT6kt
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026
Peddapalli-Palakurthy | పెద్దపల్లిలో కల్వర్ట్ను ఢీకొన్న కారు.. దంపతులు మృతి