శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 29, 2020 , 02:23:39

హరితహారం కోసం ఏర్పాట్లు

హరితహారం కోసం ఏర్పాట్లు

  • పనులు పరిశీలించిన డీఎల్‌పీవో హరికిషన్‌ 

కరీంనగర్‌ రూరల్‌ : రాజీవ్‌ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎల్‌పీవో హరికిషన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ ఆదేశంతో కరీంనగర్‌ మండలంలోని బొమ్మకల్‌ నుంచి మొగ్దుంపూర్‌ వరకు రాజీవ్‌ రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. అనంతరం దుర్శేడ్‌ గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఐదు రోజుల్లో ఎప్పుడైనా  కలెక్టర్‌ గ్రామాలను సందర్శించే అవకాశం ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీవో జగన్‌మోహన్‌రెడ్డి, గోపాల్‌పూర్‌ ఉపసర్పంచ్‌ ఆరె శ్రీకాంత్‌, దుర్శేడ్‌ కారోబార్‌ మురళి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   logo