e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

చాలా మంది చ‌రిత్ర‌ను చ‌దివి ప్ర‌భావిత‌మ‌వుతారు.. కొంద‌రే చ‌రిత్ర‌ను ప్ర‌భావితం చేస్తారు. రెండో రకం కోవ‌కు చెందిన వారే క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించాల‌నే త‌ప‌న‌ను ర‌గిల్చి కోరిక సిద్ధించే వ‌ర‌కు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన మ‌హా నాయ‌కుడు కేసీఆర్‌. ఆయ‌న చేసిన పోరాటం.. ఆయ‌న నాయ‌క‌త్వంలో ప్ర‌జ‌లు ఉద్య‌మించిన తీరు అజ‌రామ‌రం.

హైద‌రాబాద్ హుస్సేన్‌సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 20 ఏండ్ల క్రితం 2001 ఏప్రిల్ నెల‌లో స‌రిగ్గా ఇదే రోజున‌ కేవలం వంద మంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకున్నది. తెలంగాణ ఉద్యమప్రస్థానంలో మరో నూతన రాజకీయపార్టీ ప్రారంభ ప్రకటన వెలువడింది. గత ఉద్యమపంథాకు భిన్నంగా పార్లమెంటరీ పంథాలోనే రాష్ట్రసాధన లక్ష్యంగా ప్రకటించారు. హింసకు తావివ్వకుండా గాంధేయ మార్గంలో ఉద్యమ పంథాను నిర్దేశించారు. ఆ వేదిక మీద ఉద్యమనేత కే చంద్రశేఖర్‌రావు డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వాలను త్యాగం చేస్తూ చేసిన ప్రకటన ఉద్యమానికి ప్రాణప్రతిష్ట చేసింది. భవిష్యత్‌ కార్యక్రమంగా కరీంనగర్ సింహగర్జన బ‌హిరంగ స‌భ‌ ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. దశాబ్దాలుగా అణచిపెట్టుకున్న తెలంగాణ ఆకాంక్ష పెల్లుబికింది.

టీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవ‌డం అంటే ఒక ర‌కంగా కేసీఆర్ జీవిత‌చ‌రిత్ర‌ను చెప్పుకోవ‌డ‌మే. తెలంగాణలో 1969 వరకూ ఒక చరిత్ర. ఆ తర్వాత ఒక చరిత్ర. ఆంధ్ర వలసవాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వ స్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో నాయకులు కృషి చేశారు. 1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని జనం ఆశగా ఎదురు చూశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూని కేసీఆర్ బయల్దేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతి కాలంలోనే తుఫాన్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది.

కేసీఆర్‌ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో..

స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

‘కేసీఆర్‌ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ తేలిపోవాలని 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమ చరిత్రలో ఇది కీలక మలుపు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చింది. 2009 డిసెంబర్‌ 9న అప్ప‌టి హోం మంత్రి చిదంబరం.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ, కేసీఆర్‌ దీక్ష విరమించిన తర్వాత కొద్ది గంటల్లోనే యూపీఏ యూ-టర్న్‌ తీసుకుంది. దీంతో తెలంగాణలో ఉద్యమం మరింత ఉధృతమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది.

తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందింది. రాష్ట్రపతి మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్‌లో 2014 జూన్‌ 2 ‘అపాయింటెడ్‌ డే’ గా పేర్కొన్నారు. దీంతో జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇదంతా కేవ‌లం కేసీఆర్‌.. ఆయ‌న స్థాపించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ల్లే సాధ్య‌మైంది.

ఇవాళ టీఆర్‌ఎస్ మిగిలిన పార్టీలేవీ అందుకోనంత ఎత్తుకు ఎదిగింది. సమీప భవిష్యత్తులో ఇంకేపార్టీ పోటీపడే అవకాశం కూడా ఇవ్వలేనంతగా బలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వాల్లో అరకోటి మార్కు దాటిపోవడం ఇదే సూచిస్తున్నది. అటు ప్రభుత్వంగా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నది. స‌బ్బండ వ‌ర్గాల‌కు గులాబీ పార్టీ నీడ‌లా మారింది. ప్ర‌తి ఇంటిపై గులాబీ జెండా స‌ర‌గ్వంగా ఎగురుతోంది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2011: తన పుట్టుకపై వివాదం తరువాత జనన ధ్రువీకరణ పత్రాన్ని బహిరంగంగా విడుదల చేసిన బ‌రాక్ ఒబామా

1989: బంగ్లాదేశ్‌లో తుఫాను కారణంగా 500 మంది దుర్మ‌ర‌ణం

1972: భూమికి తిరిగి వచ్చిన అపోలో 16 అనే అంత‌రిక్ష నౌక‌

1960: న్యూ డిఫెన్స్ కాలేజీ న్యూఢిల్లీలో ప్రారంభం

1942: అమెరికా రాష్ట్రం ఓక్లహోమాలో తుఫాను కారణంగా 100 మంది మరణం

ఈ రోజు నేష‌న‌ల్ వార్మ్ డే

ఇవి కూడా చ‌ద‌వండి..

వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహ‌ర‌ణ..!

ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో స‌ర్వేలో వెల్ల‌డి

30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. క‌శ్మీర్‌లోని ఓ ఊరి క‌థ‌

మే నెల‌లో బాంకుల‌కు 12 సెల‌వులు.. త‌గ్గ‌నున్న ప‌ని గంట‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement