సిమ్లా : పెళ్లంటే.. పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు.. అన్నాడో సినీ కవి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరీ.. అని ఇంకో సీని కవి చెప్పారు. ఇవన్నీ ఉంటేనే పెళ్లి అని చెప్పుకుంటుంటారు. అయితే, ఇవేమీ లేకుండానే తనకు కాబోయే భార్య మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చుకున్నాడో ఐఐటీయన్.
గొప్పగా చదువుకుంటేనే కాదు.. ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి అని నిరూపించాడు హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన ఓ యువకుడు. కరోనా కాలంలో తానిష్టపడిన అమ్మాయిని మనువాడేందుకు ఒక్కడే ఆమె ఇంటికెళ్లి తాళి కట్టి ఇంటికి తెచ్చుకుని ఈ కాలం పిల్లగాండ్లకు ఆదర్శంగా నిలిచాడు ప్రన్షుల్ సైనీ. అహ్మదాబాద్‌లోని ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన ప్రన్షుల్ సైనీ.. అనంతరం జర్మనీలోని ఓ కంపెనీలో న్యూరో సైన్స్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు.
అహ్మదాబాద్‌లో ఉన్న సమయంలోనే మన్వి అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పరిణయం దాకా చేరుకున్నది. ఇరుకుటుంబాల వారు వీరి పెండ్లికి ఒప్పుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ ఉధృతంగా మారడంతో గతనెల 28 న జరుగాల్సిన పెండ్లి కాస్తా వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నది. సైనీ కుటుంబం గుజరాత్‌కు వస్తే ఇక్కడే పెండ్లి జరిపిస్తామని మన్వి కుటుంబం సూచించింది.
అయితే, కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందే అని చెప్పిన ప్రన్షుల్ సైనీ.. విమానంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్‌కు ఒక్కడే వెళ్లి సోమవారం నాడు మన్వి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకెళ్లాడు.
బాజా భజంత్రీలు, బరాత్ డ్యాన్సులు, విందులు, వినోదాలు.. ఏవీ లేకుండా ఒక్కడుగా వెళ్లి జంటగా మారి రావడం పట్ల మండిలోని సైనీ కుటుంబీకులు, ప్రన్షుల్ స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ప్రన్షుల్ పాటించిన ఆదర్శాన్ని మండి డిప్యూటీ కమిషనర్ రిగ్వేద ఠాకూర్ ప్రశంసించారు.
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
అమెరికా నుంచి ఢిల్లీకి చేరిన 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
భారత్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్, పీపీఈ కిట్లు పంపనున్న ఆస్ట్రేలియా
కరోనా సెకండ్ వేవ్ మీ వల్లే వచ్చింది.. ఈసీకి మద్రాస్ హైకోర్టు మందలింపు
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్‌లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్‌కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..