30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్‌లోని ఓ ఊరి కథ
గృహ హింస లేని ఊరు లేదంటే ఆశ్చర్యమేయదు. అయితే, ఈ ఊర్లో 30 ఏండ్లయినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ

శ్రీనగర్ : గృహ హింస లేని ఊరు లేదంటే ఆశ్చర్యమేయదు. అయితే, ఈ ఊర్లో 30 ఏండ్లయినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..! మీరు చదివింది నిజమే.. శ్రీనగర్ లోని గండర్బాల్ జిల్లాలోని అందమైన మైదానంలో ఉన్నది బాబా వాయిల్ గ్రామం. ఇక్కడి ప్రజల ధర్మం కారణంగా ఈ గ్రామాన్ని ‘బడా ఘర్’ అంటారు.
ఈ గ్రామంలో పెండ్లి ఆభరణాలు, కట్నం పూర్తిగా నిషేధించబడింది. ఈ గ్రామ ప్రజలు దాదాపు 3 దశాబ్దాలుగా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. పెండ్లి సమయంలో వధువు లేదా వరుడికి బంగారం బహుమతిగా ఇవ్వడం వంటివి ఉండవు. కుటుంబం ఎంత ధనవంతులైనా సాధారణంగానే పెండ్లి వేడుకలను జరుపాల్సి ఉంటుంది. గ్రామంలోని ధనికులు, పేదలు ఇన్నేండ్లుగా గ్రామ పెద్దలు సృష్టించిన సూత్రాలకు, విలువలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. వ్రాతపూర్వకంగా సిద్ధం చేసి పత్రం ప్రకారం.. వివాహంలో దుబారా పూర్తిగా నిషేధించబడింది.
ఈ గ్రామంలో ఎక్కువ మంది పాష్మినా, వాల్నట్ వ్యాపారం, వ్యవసాయం చేసే మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు. చాలా మంది ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్నారు. ఎవరూ కట్నం ఇవ్వకుండా ఉండటానికి పెద్దలు నిఘా ఉంచుతారు. అన్ని కార్యక్రమాలు సాధారణంగా ఉంటాయి. పెండ్లి ఖర్చులను వరుడు, వధువు కుటుంబాలు సమానంగా భరిస్తాయి. వీరి నిబంధనల ప్రకారం, కట్నం తీసుకున్నట్లు గుర్తించినట్లయితే ఆయా కుటుంబాలను సామాజిక బహిష్కరణ శిక్ష వేస్తారు. ఈ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా కూడా గ్రామం నుంచి ఎవరూ హాజరవ్వరు.
30 ఏళ్లలో ఇప్పటివరకు గ్రామంలో గృహ హింస, కట్నం కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇదొక్కటే కాకుండా.. వరకట్నం, వివాహంలో ఖర్చుల ఒత్తిడి కారణంగా గ్రామ ప్రజలు తమ కుమార్తెలను 25 సంవత్సరాల వయస్సులోపే పెండ్లిండ్లు చేస్తున్నారు. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో బాలికలకు సరైనా అబ్బాయిలు దొరుకడం లేదంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు, అదే బాబా వాయిల్ గ్రామం నుంచి పిల్లను ఇస్తామని ఎవరైనా ముందుకు వస్తే కండ్లు మూసుకుని పెండ్లి చేసుకుంటున్నారంట.
ఇవి కూడా చదవండి..
సౌదీ నుంచి భారత్‌కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్‌లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఘజియాబాద్‌లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

