హిమాచల్‌లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
హిమాచల్ ప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చే సందర్శకులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేయనున్నారు.
ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రా, ఉనా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున కర్ఫ్యూ విధించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుంచి మే 10 వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు.
కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు అమలులో ఉంటుంది. ఈ కర్ఫ్యూ సమయంలో ఎవరు కూడా బయట తిరుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
హిమాచల్‌కు వచ్చే సందర్శకులందరికీ 72 గంటల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయాలని కూడా నిర్ణయించారు. ఒకవేళ ప్రజలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోకపోతే, వారు 14 రోజులు గృహ నిర్బంధంలో / ఒంటరిగా ఉండవలసి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా మార్గదర్శకాలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ .. కెమెరాకు చిక్కిందంటున్న ఓ మహిళ.. వీడియో
ఘజియాబాద్‌లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై దాడి.. ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతం
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

