మే నెలలో బ్యాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
మే నెలలో బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోవడం బెటర్. లేదంటే మే 3 వరకు వేచి ఉండాలి

ముంబై : మే నెలలో బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోవడం బెటర్. లేదంటే మే 3 వరకు వేచి ఉండాలి. మే నెలలో గత నెలలో మాదిరిగానే మొత్తం 12 రోజులు సెలవులు వస్తున్నాయి. మే 1 మహారాష్ట్ర దినోత్సవం / మేడే. మేడే రోజున కొన్ని రాష్ట్రాల బ్యాంకులను మూసివేస్తారు. మరుసటి రోజు ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం. 7 వ తేదీన జమాతుల్ విద సందర్భంగా బ్యాంకులకు సెలవు. మరుసటిరోజు రెండో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం యధావిధిగా సెలవులు ఉంటాయి. 13 న ఈదుల్ ఫితర్, 14 న రంజాన్, 16 ఆదివారం, 22 నాలుగో శనివారం, 23 ఆదివారం, 26 బుద్ధపూర్ణిమ, 30 ఆదివారం సెలవులు ఉండనున్నాయి.
ఇలాఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బ్యాంకులు 4 గంటలు మాత్రమే తెరుచుకోనున్నాయి. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరువాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సూచించింది. అంటే, ఇప్పుడు బ్యాంకులు సాధారణ ప్రజలకు 4 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కరోనా మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ కమిటీలను ఐబీఏ కోరింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ స్థితి వచ్చే వరకు ఈ విధానం అమలులో ఉంటుందని ఐబీఏ తెలిపింది.
ఐబీఏ మార్గదర్శకాలు
అన్ని బ్యాంకులను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరువాలి.
బ్యాంకింగ్‌లో కేవలం నాలుగు రకాల సేవలనే అందించాలి. ఇందులో నగదు డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరింగ్, చెల్లింపులు, ప్రభుత్వ లావాదేవీలు ఉన్నాయి.
ఎట్టి పరిస్థితిలోనూ అన్ని బ్యాంకులను సాయంత్రం 4 గంటలకు మూసివేయాలి.
కరోనా సమయంలో 50 శాతం ఉద్యోగులను మాత్రమే బ్యాంకుకు పిలుస్తారు.
ఇతర ఉద్యోగులు పనులను ఇంటి నుంచి చేసుకోవాలి.
బ్యాంకుల్లోని ఉద్యోగులను రొటేషన్ ప్రాతిపదికన పిలువాలి.
రాష్ట్రస్థాయి కమిటీలు పరిస్థితిని పర్యవేక్షించి, పరిస్థితులను బట్టి అదనపు సేవలను నిర్ణయిస్తాయి.
బ్యాంకింగ్ సేవలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకున్నా అది చెల్లుతుంది.
ఇవి కూడా చదవండి..
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్‌కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

