e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్‌

కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్‌

ఆక్లాండ్‌: ఓవైపు ఇండియా స‌హా ప్ర‌పంచంలోని చాలా దేశాలు క‌రోనా మ‌హమ్మారిని నియంత్రించ‌లేక తంటాలు ప‌డుతున్నాయి. లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు పెడుతున్నాయి. మ‌రోవైపు న్యూజిలాండ్ మాత్రం ఆ మ‌హ‌మ్మారిని జ‌యించి పండుగ చేసుకుంటోంది. శ‌నివారం రాత్రి ఏకంగా 50 వేల మందితో దేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్ స్టేడియంలో లైవ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వ‌హించారు. ప్ర‌పంచ‌మంతా మ‌హ‌మ్మారి గుప్పిట్లో ఉన్నా.. తాము మాత్రం సాధార‌ణ జీవితాలు గ‌డ‌ప‌గ‌లం అని మా న‌గ‌రం నిరూపించింద‌ని ఆక్లాండ్ మేయ‌ర్ ఫిల్ గోఫ్ ఘ‌నంగా ప్ర‌క‌టించారు.

కొవిడ్ మ‌హ‌మ్మారి మొద‌లైన త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో వేడుక‌ల నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ప్ర‌ముఖ బ్యాండ్ సిక్స్60 ప్రేక్ష‌కుల ఉర్రూత‌లూగించింది. ఈ ఈవెంట్‌ను ద‌క్షిణ ప‌సిఫిక్ దేశాల‌లో లైవ్ స్ట్రీమ్ చేయ‌డం విశేషం. మాస్క్‌లు, భౌతిక దూరాలు అవ‌స‌రం లేక‌పోవ‌డంతో అక్క‌డి మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఈ కాన్స‌ర్ట్‌ను ఎంత‌గానో ఎంజాయ్ చేశారు.

- Advertisement -

ఎలా సాధ్య‌మైంది?

క‌రోనాను క‌ట్ట‌డి చేశాం చూడండి అని న్యూజిలాండ్ ఈ ఈవెంట్ ద్వారా ప్ర‌పంచానికి ఘ‌నంగా చాటి చెప్పింది. క‌రోనాను నియంత్రించ‌డానికి ఆ దేశం అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. అంత‌ర్జాయ‌తీ స‌రిహ‌ద్దుల‌ను మూసేసింది. పెద్ద సంఖ్య‌లో టెస్టులు చేసింది. ప్రైమ‌రీ కాంటాక్ట్‌ల‌ను శ‌ర‌వేగంగా గుర్తించింది.

మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కూ న్యూజిలాండ్‌లో న‌మోదైన క‌రోనా కేసులు 2600 మాత్ర‌మే కాగా.. కేవ‌లం 26 మంది మాత్ర‌మే చ‌నిపోయారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌ను మూసివేయడం ద్వారా త‌మ టూరిజం దారుణంగా దెబ్బ తిన్నా ఆ దేశం పెద్ద‌గా బాధ‌ప‌డ‌లేదు. ముందు ఈ క‌రోనా పీడ విర‌గ‌డైతే చాల‌నుకుంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాకు మాత్ర‌మే త‌న స‌రిహ‌ద్దుల‌ను తెరిచింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana