ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ .. కెమెరాకు చిక్కిందంటున్న ఓ మహిళ.. వీడియో
ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ కనిపించింది. తన యార్డ్ గుండా ఒక పిల్ల డైనోసార్ పరిగెత్తుకుంటూ పోతున్న వీడియోను చూశానని ఓ మహిళ చెప్తున్నది.

ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ కనిపించింది. తన యార్డ్ గుండా ఒక పిల్ల డైనోసార్ పరిగెత్తుకుంటూ పోతున్న వీడియోను చూశానని ఓ మహిళ చెప్తున్నది. ఆన్లైన్లో వైరల్ అయిన ఐదు సెకన్ల అస్పష్టమైన ఫుటేజ్ ద్వారా ఆమె వాదనకు మద్దతు కనిపిస్తున్నది. తన యార్డులో పరిగెడుతూ వెళ్తున్న బేబీ డైనోసార్ తన కెమెరాలకు చిక్కిందని క్రిస్టినా ర్యాన్ చెప్తున్నది. తన యార్డ్‌లో చిత్రించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ నెల 15 వ తేదీ రాత్రి సమయంలో తన యార్డ్‌లోని కెమెరాల్లో పిల్ల డైనో కనిపించిందని, అది అచ్చం డైనోసార్ మాదిరిగా పొడవైన తోకతో ఉన్న జంతువులా కనిపించిందని క్రిస్టినా ర్యాన్ వెల్లడించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాన్ వాదనను పలువురు నెటిజెన్లు కొట్టిపారేస్తున్నారు. కుక్క, నక్క మొదలైనవి కావచ్చు అని చాలామంది అంటున్నారు. అది టర్కీ మాదిరిగా కనిపిస్తుందని ఒకరు రాయగా.. అది డైనోసార్ కాదు పీఫౌల్ లేదా రింగ్ మెడ ఉండే నెమలి అయి ఉంటుందని ఒక నెటిజెన్ వివరించారు.
కుక్క, నక్క అయితే, ఆ జంతువులు ఆ విధంగా పరిగెత్తవు కదా అని ర్యాన్ ప్రశ్నిస్తున్నారు. నేను ‘జురాసిక్ పార్క్ సినిమాను చాలాసార్లు చూశాను, కాని రాప్టర్ లేదా ఇతర చిన్న డైనోసార్లను ఇప్పుడే చూశాను అని చెప్తున్నారావిడ.
ఇవి కూడా చదవండి..
ఘజియాబాద్‌లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై దాడి.. ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతం
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్‌కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

