జవహర్నగర్, మే 29: పోక్సో కేసులో ఓ నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ మేడ్చ ల్ పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. జవహర్నగర్ ఎస్హెచ్వో సైదులు తెలిపిన వివరాల ప్రకారం… అరుంధతినగర్లో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్, ధూమాన్గంజ్ గ్రామానికి చెందిన పర్వేష్ యాదవ్(25) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
ఇంటి పక్కనే ఉండే ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో 1 డిసెంబర్ 2024లో జవహర్నగర్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. నిందితుడైన పర్వేష్ను పోలీసులు 6 డిసెంబర్ 2024లో రిమాండ్కు తరలించారు. ఈ కేసు పూర్వాపరాలు విన్న మేడ్చల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధేశిస్తూ 20ఏళ్ల జైలు జీవితం, రూ. 10వేల జరిమాన చెల్లించాలని తెలిపింది.