మేడిపల్లి, మే 29 : దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి రూ.25 లక్షల నగదు కాజేసిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ రాధాకృష్ణకాలనీకి చెందిన బుడుత వినోద్‌కుమార్‌కు (62) నాలుగేళ్ల క్రితం ఖైరతాబాద్ ఆనంద్ నగర్‌కు చెందిన చంద్రగిరి శ్రీకాంత్ (35) పరిచయమయ్యాడు.
వినోద్‌కుమార్ పెద్ద కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ తొలుత 2.12 లక్షలు అనంతరం 6లక్షలు వసూల్ చేశాడు. చిన్న కుమారుడికి ఉద్యోగం పేరిట 2.12లక్షలు, కుమార్తె శ్వేతకు ఉద్యోగం ఇప్పిస్తామని 4లక్షలు తీసుకున్నాడు. దళిత బంధు కింద వాహనం మంజూరు చేయిస్తానని మరో 2లక్షలు వ్యక్తి గత అవసరాల కోసం 8లక్షలు తీసుకున్నాడు. మొత్తం రూ.25 లక్షలు తీసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో వినోద్ కుమార్ నా డబ్బులు నాకు ఇవ్వమని శ్రీకాంత్‌ను అడిగితే చెక్కులు ఇచ్చాడు. అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితుడు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.