కీసర, మే 29: 1-2 రెండు రోజుల వయస్సు గల నవజాత శిశువు లభ్యమైన ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. నాగారం విజయపురి కాలనీ, రోడ్డు నెం.4లోని దోభీఘాట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు 1-2 రెండు రోజుల నవజాత శిశువును కవర్లో వదిలివెళ్లారని, అక్కడికి నుంచి దుర్వాసన వస్తోందని కీసర పోలీస్స్టేషన్ మోబైల్ ఇన్చార్జి పీసీ జంగయ్యకు 100 డయిల్ ద్వారా శెట్టి సోమరాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడు.
దీంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా నవజాత మగశిశువు మృతదేహం కనిపించింది. అనంతరం అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని శిశువును పరిక్షించి మృతిచెందిన్నట్లు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.