స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత
రష్యా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ సందేహాలు వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది

రియో డీ జనీరో: రష్యా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ సందేహాలు వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఆర్డర్ చేయడానికి బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ నిరాకరించింది. రష్యన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కి సంబంధించి తమ వద్ద సురక్షితమైన, సమర్థవంతమైన డాటా లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పారు. “మిలియన్ల మంది బ్రెజిలియన్లు దాని నాణ్యత, భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్పత్తిని ఉపయోగించడానికి మేం ఎప్పటికీ అనుమతించం” అని ఆరోగ్య నియంత్రణ అధికారి ఒకరు చెప్పారు.
ప్రపంచంలోని అనేక దేశాలలో ఉపయోగం కోసం స్పుత్నిక్ వీ సప్లిమెంట్స్ ఆమోదించారు. కరోనా ఇన్ఫెక్షన్ను నివారించడంలో ఇది 97.6 శాతం ప్రభావవంతంగా ఉంటుందని రష్యన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ అన్విసా మాదిరిగా యూరోపియన్ యూనియన్ ఇంకా ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించలేదు. ఈ వ్యాక్సిన్ తయారీ విధానం, పరీక్షల గురించి మరింత సమాచారం అవసరమని యూరోపియన్ యూనియన్ పేర్కొన్నది. రష్యా వ్యాక్సిన్ దిగుమతిని ఆమోదించవద్దని ఎన్విజా ఐదుగురు సభ్యుల బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేసింది. వాస్తవానికి ఈ టీకా ప్రమాదం, తీవ్రమైన లోపాల గురించి సాంకేతిక సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు, బ్రెజిల్లో 16 మిలియన్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 4 లక్షల మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 4.16 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్రస్‌లు
ఇతను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైరల్
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్‌లోని ఓ ఊరి కథ
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

