అమెరికా జనాభా 33 కోట్లు.. 2020 సెన్సెస్ డాటా విడుదల
అమెరికా జనాభా 33 కోట్లకు చేరింది. 2020 జనాభా లెక్కల డాటాను యూఎస్ పాపులేషన్ బ్యూరో విడుదల చేసింది

వాషింగ్టన్ : అమెరికా జనాభా 33 కోట్లకు చేరింది. 2020 జనాభా లెక్కల డాటాను యూఎస్ పాపులేషన్ బ్యూరో విడుదల చేసింది. 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ నివాస జనాభా 2020 ఏప్రిల్ 1 నాటికి 331,449,281 గా ఉన్నది. 2010 జనాభా లెక్కల తరువాత 7.4 శాతం పెరుగుదల కనిపించింది.
ఈ సంవత్సరం చివరి నాటికి వివరణాత్మక డాటా అందించే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో కూడా పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు. యూఎస్‌లో ప్రతి రాష్ట్రంలో ఎన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు ఉంటాయో జనాభా ప్రకారం నిర్ణయిస్తారు. ఈ గణాంకాల ఆధారంగా ఒక రాష్ట్రానికి ఎంత సహాయం అందించాలో కూడా సమాఖ్య ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇవే గణాంకాలు కూడా ప్రభుత్వ పథకాలకు ఆధారంగా నిలుస్తాయి.
టెక్సాస్, కొలరాడో, ఫ్లోరిడా, మోంటానా, నార్త్ కరోలినా, ఒరెగాన్ రాష్ట్రాల్లో కొన్ని సీట్లు పెరుగుతుండగా.. కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మిచిగాన్, న్యూయార్క్, ఒహియో, పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలు సీట్లు కోల్పోనున్నాయని 2020 జనాభా లెక్కల ఆధారంగా విభజన లెక్కలు చూపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
నటుడు మిథున్ చక్రవర్తికి కరోనా పాజిటివ్
పాకిస్తాన్‌కు సమస్యగా మారనున్న అల్ ఖైదా వంటి సంస్థలు.. అమెరికన్ జనరల్ హెచ్చరిక
వివాదాస్పద ద్వీపాల వద్ద ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు
స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత
అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్రస్‌లు
ఇతను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైరల్
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

