కోల్‌కతా: బాలీవుడ్ సూపర్ స్టార్, ఇటీవల బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా ఇన్ఫెక్షన్కు గురైన అనంతరం అతడు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిథున్ చక్రవర్తి బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆయన కొవిడ్ పాజిటివ్‌గా తేలారు.
మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంతా తిరుగుతూ బీజేపి అభ్యర్థుల కోసం ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తాను కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తనతో గత కొన్నిరోజులుగా దగ్గరగా గడిపిన నేతలందరూ కొవిడ్ పరీక్షలు చేయంచుకోవాలని మిథున్ సూచించారు.
తాలిగంజ్ అభ్యర్థి, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, సీపీఐ-ఎం జాదవ్‌పూర్ అభ్యర్థి సుజన్ చక్రవర్తి, బీజేపీ అభ్యర్థి పర్నో మిత్రా, సీపీఐ-ఎం అభ్యర్థి శతరూప్ ఘోష్, టీఎంసీ కమర్హతి అభ్యర్థి మదన్ మిత్రాతో పాటు పలువురు అభ్యర్థులు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన అనంతరం కొవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. కరోనా ఇన్ఫెక్షన్లను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ఇప్పటివరకు కొవిడ్ -19 ఇన్ఫెక్షన్ కారణంగా నలుగురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు.
బెంగాల్లో కరోనా పరీక్ష చేయించుకున్న ప్రతి నాలుగో వ్యక్తి పాజిటివ్‌గా తేలుతున్నట్లు సమాచారం. ఇక్కడ పాజిటివిటీ రేటు నిరంతరం పెరుగుతున్నది. ఏప్రిల్ 1 న రాష్ట్రంలో 25,766 శాంపిల్ దర్యాప్తులో 1,274 శాంపిల్స్ పాజిటివ్‌లుగా గుర్తించారు. ఏప్రిల్ 24 న 55,060 శాంపిళ్లను పరీక్షించగా.. వాటిలో 14,281 పాజిటివ్ కేసులు వచ్చాయి. బెంగాల్లో గత 24 గంటల్లో కరోనా కారణంగా 59 మంది మరణించారని, ఇన్ఫెక్షన్కు గురైన వారి సంఖ్య 16,000 కు చేరుకుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
పాకిస్తాన్‌కు సమస్యగా మారనున్న అల్ ఖైదా వంటి సంస్థలు.. అమెరికన్ జనరల్ హెచ్చరిక
వివాదాస్పద ద్వీపాల వద్ద ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు
స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత
అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్రస్‌లు
ఇతను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైరల్
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..