మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 25, 2020 , 02:03:42

లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి

ధర్మపురి: లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని డీఆర్‌డీఏ ఏపీడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం హరితహారంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం నుంచి నిర్వహించనున్న హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నర్సరీల నుంచి ఎంపిక చేసిన మొక్కలనే ఆయా గ్రామాలకు తీసుకువెళ్లాలన్నారు. మొక్కలు నాటి చుట్టూ ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం 1.50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన మొక్కలను నాటాలన్నారు. ప్రజాపత్రినిధులతో మొక్కలు పంపిణీ చేయించి ఇండ్లలో నాటించాలని సూచించారు. డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మొక్కలను విరివిగా నాటి ఆకుపచ్చని గ్రామాలను రూపొందించుకుందామని పిలుపునిచ్చారు. డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ఇన్‌చార్జి ఎంపీడీవో సంజీవరావు, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రాజేశ్‌కుమార్‌, జైన పీఏసీఎస్‌ చైర్మన్‌ సౌళ్ల నరేశ్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీవో నరేశ్‌, ఏపీవో సుజన్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కోరుట్ల: మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో హరితహారంపై వీవోఏలతో ఎంపీడీవో శ్రీనివాస్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విరివిగా మొక్కలను నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల వారీగా ఏయే మొక్కలు ఉన్నాయో పరిశీలించి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎం శంకర్‌, సీసీలు సురేందర్‌, శాంత, రమణ, లావణ్య, ఆయా గ్రామాల వీవోఏలు పాల్గొన్నారు. 

గొల్లపల్లి: వెంగళాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ గుండ రమ్య అధ్యక్షతన హరితహారంపై సమావేశం నిర్వహించారు. 7,500 మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తీర్మానించారు. సమావేశంలో ఎంపీవో సలీం, ఉప సర్పంచ్‌ మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నయీమొద్దీన్‌, వార్డు సభ్యులు మంగ, మల్లారెడ్డి, రాంరెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇబ్రహీంపట్నం:  మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో హరితహారం విజయవంతంపై ఏపీడీ సుందరవరదరాజన్‌ మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెండు లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని విధించిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే విధానాన్ని అటవీ సెక్షన్‌ అధికారి సక్కారాం డెమో ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, తహసీల్దార్‌ స్వర్ణ, ఎంపీడీవో శైలజారాణి, ఏపీవో దివ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

మల్యాల: మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి ప్రత్యేకాధికారులు, సర్పంచులతో ఎంపీపీ మిట్టపల్లి విమల, మండల ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్‌ ఈఈ మనోహర్‌రెడ్డి హరితహారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడంతోపాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో బండి సుధాకర్‌, ఈజీఎస్‌ ఈసీ మనోజ్‌, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్‌, బద్దం తిరుపతిరెడ్డి, గొడుగు కుమారస్వామి, కట్కూరి తిరుపతి, రాసమల్ల హరీశ్‌, సుంకె లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి రూరల్‌: మండల పరిషత్‌ సమావేశ మందిరంలో హరితహారంపై ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మారు సాయిరెడ్డి మాట్లాడుతూ.. మెట్‌పల్లి మం డలంలో రెండు లక్షల ఒక వెయ్యి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రహదారుల వెంబడి మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేసి సంరక్షించాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి రజిత, ఎఫ్‌ఆర్వో రాజేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీ రాజేందర్‌, నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ రాజశ్రీనివాస్‌ ఉన్నారు.


logo