Health Insurance | 15 శాతం వరకు పెరగనున్న ఆరోగ్య బీమా ప్రీమియం!
ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నిర్ణయంతో ప్రీమియం చార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
- 15 శాతం వరకు పెంచేయోచనలో సంస్థలు: లోకల్సర్కిల్ సర్వేలో వెల్లడి
Health Insurance | న్యూఢిల్లీ, మే 8: ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నిర్ణయంతో ప్రీమియం చార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నాయని లోకల్సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు. ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి జంకుతున్నారు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు ఆ తర్వాతి ఏడాదిలో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా రంగం రికార్డు స్థాయిలో లక్ష కోట్ల రూపాయలను ఆర్జించింది. వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా ఉన్నది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

