బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 13:36:19

టిక్‌టాక్‌ సీఈఓగా వైదొలిగిన కెవిన్‌ మేయర్‌

టిక్‌టాక్‌ సీఈఓగా వైదొలిగిన కెవిన్‌ మేయర్‌

బీజింగ్‌ : టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి కెవిన్ మేయర్ వైదొలిగినట్లు ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఆ సంస్థ లావాదేవీలపై నిషేధించిన తరువాత సంస్థ ఉద్యోగిలో ఒకరు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై వేర్వేరుగా కేసులు వేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకు ఆయన రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఊటంకిస్తూ.. ‘ఎన్నికల సమయంలో చైనా వ్యతిరేక వాదానికి ఆజ్యం పోసేందుకు ఇది ఓ సాకు. సంస్థను వదిలివెళ్లేందుకు బరువెక్కిన హృదయంతో నిర్ణయించుకున్నా’ అని సిబ్బందికి రాసిన లేఖలో కెవిన్‌ పేర్కొన్నారు.

కెవిన్‌ స్థానంలో సంస్థ జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ సీఈఓగా బాధ్యతులు చేపట్టనున్నారు. చైనాకు చెందిన టిక్ టాక్‌ మాతృసంస్థ పేరెంట్ బైట్ డాన్స్‌కు జూన్‌లో కెవిన్‌ మేయర్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పని చేశారు. తరువాత  ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యిమింగ్‌ జాంగ్‌ ఆయనను టిక్‌టాక్‌ సీఈఓగా నియమించారు. టిక్‌టాక్, బైట్‌డాన్స్‌తో జాతీయ భద్రతకు, అమెరికా వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో అమెరికా ఇటీవల వీటిని నిషేధిచింది. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి గెలిచేందుకు చైనా వ్యతిరేక వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకే టిక్ టాక్‌పై నిషేధం విచారని ఆరోపణలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo