కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాసవిడిచారు. ఎమ్మెస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు.
1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఎమ్మెస్సార్ కీలకపాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. 1980-83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985-88 వరకు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు.
1990-94 వరకు రెండుసార్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారు. 2000-04 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కరీంనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004-07 వరకు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2006లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సవాల్ చేసి కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికకు కారణమయ్యారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఎమ్మెస్సార్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

