Paris AI Summit : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. అగ్రదేశాలతోపాటు ప్రముఖ సంస్థలు ఈ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు (Investments) పెడుతున్నాయి. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో పారిస్‌లోని గ్రాండ్ పలైస్ వేదికగా జరిగే ‘పారిస్ AI యాక్షన్ సమ్మిట్ (Paris AI Action Summit)’ లో ప్రపంచ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు AI భవిష్యత్తు గురించి, AI ని ఉపయోగించాల్సిన తీరు గురించి చర్చించనున్నారు.
ప్రస్తుతం AI అభివృద్ధి ఊహించని స్థాయిలో జరుగుతుండటంతో దాని ముప్పులను తగ్గిస్తూ, ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించనున్నారు. ఇదే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ సదస్సును ఫ్రాన్స్ నిర్వహిస్తుండగా.. భారత్ కో-ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తోంది. ఈ రెండు రోజుల సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు.
ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, జర్మనీ ఛాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, OpenAI సీఈఓ సామ్ ఆల్ట్మాన్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సదస్సులో పాల్గొననున్నారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా హాజరుకానున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇది ఆయన మొదటి అంతర్జాతీయ పర్యటన. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ సదస్సుకు ప్రత్యేక రాయబారిని పంపారు.
సదస్సులో ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. చివరి రోజు ప్రపంచ నాయకులు, కార్పొరేట్ నేతలు ప్రసంగించనున్నారు. 2022లో ChatGPT ప్రారంభమైనప్పటి నుంచి AI అనేక పరిశ్రమలకు విస్తరించింది. హెల్త్‌కేర్ నుంచి ఫైనాన్స్ వరకు అన్ని రంగాలు AI టూల్స్ ఉపయోగించుకుంటున్నాయి. అయితే AI టెక్నాలజీతో మేలు కంటే ముప్పే ఎక్కువగా ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన AI సమ్మిట్లు ప్రధానంగా సేఫ్టీ, నాన్-బైండింగ్ అగ్రిమెంట్స్‌పై దృష్టి సారించాయి.
2023లో యూకేలో జరిగిన AI సమ్మిట్‌లో 28 దేశాలు AI ప్రమాదాలను నియంత్రించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన సమ్మిట్ కూడా ఆ కృషిని బలోపేతం చేసింది. కానీ పారిస్ AI సమ్మిట్‌లో కేవలం AI భద్రత మాత్రమే కాదు, AI నైతికత, పర్యావరణ అనుకూలత, సామాజిక ప్రభావం లాంటి అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. AI అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు స్పష్టమైన నియమాలు అవసరమని అన్నారు.
తాజా సమ్మిట్ ద్వారా AI అభివృద్ధిపై గణనీయమైన కమిట్మెంట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా నైతిక, పర్యావరణ అనుకూల AI అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే రాజకీయ ప్రకటన చేయడం ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. అయితే అమెరికా ఈ ప్రకటనకు అంగీకరిస్తుందా.. లేదా..? అనేది అనుమానంగా మారింది.
Delhi CM post | ఢిల్లీ సీఎం పదవి ఒక మహిళను వరించబోతోందా..?
Manipur CM face | పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే
Devendra Fadnavis | వాక్ స్వేచ్ఛ ఉందికదా అని నోరు పారేసుకోవద్దు.. యూట్యూబర్‌కు మహా సీఎం వార్నింగ్
Naresh Mhaske | అది పెళ్లికొడుకు లేని పెళ్లి ఊరేగింపు.. ఇండియా కూటమిపై శివసేన ఎంపీ కామెంట్
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..!