Ranveer Allahbadia : తల్లిదండ్రుల శృంగారంపై నోటికొచ్చింది మాట్లాడి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న 31 ఏళ్ల యూట్యూబర్ (YouTuber) రణ్వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) క్షమాపణ (Sorry) లు చెప్పాడు. ఈ మేరకు సారీ చెబుతూ రికార్డు చేసిన ఒక వీడియోను ఆయన తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో పోస్టు చేశాడు. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడినందుకు తనను క్షమించాలని ఆ వీడియోలో కోరాడు. పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, నాకు హాస్యం చేయడం రాదని, అయినా హాస్యం చేయబోయి తప్పు మాట్లాడానని తెలిపారు.
యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్‌కు చెందిన రణ్వీర్ అలహబాదియా.. కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాలతోపాటు షోలో పాల్గొన్న రణ్వీర్అలహబాదియా.. ‘తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా..? లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా..?’ అని ఒక కంటెస్టెంట్‌ను ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై ముంబై పోలీస్ కమిషనర్‌కు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. తల్లిదండ్రుల వ్యక్తిగత సంబంధాల గురించి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉందని జనం మండిపడ్డారు. దాంతో దెబ్బకు దిగొచ్చిన యూట్యూబర్ క్షమాపణలు చెప్పాడు.
Naresh Mhaske | అది పెళ్లికొడుకు లేని పెళ్లి ఊరేగింపు.. ఇండియా కూటమిపై శివసేన ఎంపీ కామెంట్
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..!
Ayodhya Ram Mandir | ప్రయాగ్‌రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!
Sonia Gandhi:వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టండి: సోనియా గాంధీ డిమాండ్