Rahul Gandhi On Kerala Story | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేరళ పర్యటనలో భాగంగా మరియన్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో సినిమా రంగం రాజకీయ సాధనంగా మారుతుండటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాలను రాజకీయ సాధనాలుగా వాడుకోంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి.? అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ.. సినిమాలు, టీవీలు మరియు మీడియాను ఈ రోజుల్లో ప్రజల మధ్య విభజన సృష్టించడానికి, నిర్దిష్ట వర్గాలను కించపరచడానికి ఆయుధాలుగా వాడుతున్నారని, దీని వెనుక భారీగా నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘కేరళ స్టోరీ 2’ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడం ఒక మంచి వార్త అని, ఆ సినిమా ఆడుతున్న హాల్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలపై అక్కడి ప్రజలకు ఉన్న అవగాహనకు ఈ సినిమా పరాజయమే నిదర్శనమని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Student : Do you think movies have become political tool in India?
Rahul Gandhi : The good news is that Kerala Story turned flop and nobody is watching it 🔥
Burnol moment for sanghis in just one sentence. Bro’s aura is crazy 🗿 pic.twitter.com/rQlr2dYYYY
— Amock_ (@Amockx2022) March 6, 2026