Donald Trump : రెండోసారి అమెరికా అధ్యక్ష (USA president) పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వడివడిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో సమూల మార్పులు చేస్తున్నారు. విదేశీ అక్రమ వలసదారుల (Illegal migrants) ను వెనక్కి పంపడం, విదేశీ దిగుమతులపై టారిఫ్ (Tariffs) లు విధించడం, గాజా (Gaza) ను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం తదితర నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సుదీర్ఘకాలంగా దాని విలువ కంటే రెండింతల అదనపు ఖర్చుతో కాయిన్లను ముద్రిస్తున్నదని, ఇది చాలా వృథా ఖర్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘కొత్త కాయిన్లను ముద్రించడం ఆపేయాలని నేను అమెరికా ట్రెజరీకి సంబంధించిన నా సెక్రెటరీకి సూచించాను. కాయిన్ విలువ కంటే దాని ముద్రణ కోసం ప్రభుత్వం చేసే ఖర్చు రెండింతలు అదనంగా ఉంటోంది. దేశ బడ్జెట్ నుంచి వృథాను అరికట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని ట్రంప్ సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. అయితే అమెరికాలో కాయిన్ల ముద్రణ నిలిపివేయడంపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ విషయమై గతంలో ఎన్నో బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి. కానీ అవేవీ కాంగ్రెస్ ఆమోదం పొందలేదు.
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..!
Ayodhya Ram Mandir | ప్రయాగ్రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!
Sonia Gandhi:వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టండి: సోనియా గాంధీ డిమాండ్