Devendra Fadnavis : పేరెంట్స్ శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ (YouTuber) రణ్వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) కు మహారాష్ట్ర సీఎం (Maharastra CM) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్ట్రాంగ్ వార్నింగ్ (Strong worning) ఇచ్చారు. వాక్ స్వాతంత్య్రం ఉందికదా అని నోరు పారేసుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంటుందని, కానీ మనం ఇతరుల వాక్ స్వేచ్ఛను హరించినప్పుడు మన వాక్ స్వేచ్ఛ ముగిసిపోతుందని అన్నారు.
‘ఈ విషయం గురించి నాకు ఇప్పుడే తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోలేదు. మనం మాట్లాడే కొన్ని విషయాలు ఒక్కోసారి సమాజంలోకి తప్పుగా వెళ్తాయి. ప్రతి ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇతరుల వాక్ స్వేచ్ఛను హరించినప్పుడు మన వాక్ స్వేచ్ఛ ముగిసిపోతుంది. మన సమాజంలో మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం. కొందరు ఆ నియమాలను ఉల్లంఘించడం తప్పు. అలాంటి వారిపై తప్పక చర్యలు ఉంటాయి.’ అని ఫడ్నవీస్ అన్నారు.
తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో యూట్యూబర్ అలహబాదియా క్షమాపణలు చెప్పారు. తన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాగా అలహబాదియా క్షమాపణలు చెప్పడానికి ముందే లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా అతని వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణ్వీర్తో పాటు ఇతర కమెడియన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Naresh Mhaske | అది పెళ్లికొడుకు లేని పెళ్లి ఊరేగింపు.. ఇండియా కూటమిపై శివసేన ఎంపీ కామెంట్
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..!
Ayodhya Ram Mandir | ప్రయాగ్రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!