Delhi CM post : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక (Delhi Assembly elections) ల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించి రెండు రోజులైంది. ఈ క్రమంలో ఢిల్లీ కొత్త సీఎం (New CM) ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ నాయకత్వం (BJP leadership) కొత్త సీఎం ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించక ముందే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు ఎమ్మెల్యేలు (MLAs) కాని వాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఢిల్లీ సీఎం పదవిలో కచ్చితంగా ఎమ్మెల్యేల్లో ఒకరే ఉంటారని చెబుతున్నాయి.
సీఎం పదవి రేసులో ఎన్నో పేర్లు చర్చకు వస్తున్నా.. ముందు వరుసలో మాత్రం న్యూఢిల్లీలో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. పర్వేష్ వర్మ గతంలో రెండు పర్యాయాలు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. పర్వేష్ వర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కొత్తగా ఎన్నికైన మాళవీయనగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్ పేరు కూడా సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.
వీరితో పార్టీ సీనియర్ నేత విజేందర్ గుప్తా, జనక్‌పురి ఎమ్మెల్యే అశీష్ సూద్, ఉత్తమ్‌నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ పేర్లు కూడా సీఎం రేసులో వినబడుతున్నాయి. కానీ బీజేపీ నాయకత్వం సీఎం లాంటి టాప్ పదవుల విషయంలో అంచనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒక మహిళకు సీఎం పదవి కట్టబెట్టినా ఆశ్యర్చపోనక్కరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు బీజేపీ తరఫున ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు ఉన్నారు.
వారిలో నీలమ్ పహల్వాన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నజఫ్‌గఢ్ స్థానం నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. ఆమెతోపాటు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షురాలు రేఖా గుప్తా, వాజీపూర్ ఎమ్మెల్యే పూనమ్ శర్మ, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించిన శిఖా రాయ్ పేర్లు కూడా సీఎం పదవి రేసులో ఉన్నాయి. అదేవిధంగా కుల సమీకరణాల ఆధారంగా ఎస్సీ ఎమ్మెల్యేకు కూడా పార్టీ నాయకత్వం సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజాగా ఎన్నికైన 48 మంది ఢిల్లీ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో రాజ్‌కుమార్ చౌహాన్ మంగోల్‌పురి నుంచి, రవికాంత్ ఉజ్జెయిన్ త్రిలోక్‌పురి నుంచి, రవిందర్ ఇంద్రజ్ సింగ్ బావనా నుంచి, కైలాష్ గంగ్వార్ మడిపూర్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి బీజేపీ హైకమాండ్ సీఎం పదవి కట్టబెట్టినా కట్టబెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇన్న ఊహాగానాలు, అంచనాల నడుమ మరి బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Manipur CM face | పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే
Devendra Fadnavis | వాక్ స్వేచ్ఛ ఉందికదా అని నోరు పారేసుకోవద్దు.. యూట్యూబర్‌కు మహా సీఎం వార్నింగ్
Naresh Mhaske | అది పెళ్లికొడుకు లేని పెళ్లి ఊరేగింపు.. ఇండియా కూటమిపై శివసేన ఎంపీ కామెంట్
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..!
Ayodhya Ram Mandir | ప్రయాగ్‌రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!