Manipur CM face : రెండు తెగల (Two tribes) మధ్య అల్లర్ల అనంతరం మణిపూర్ (Manipur) లో పరిస్థితిని సాధారణ స్థితికి తేవడంలో విఫలమైన బీరేన్ సింగ్ (Biren Singh) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఇప్పుడు మణిపూర్ నూతన సీఎం ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాబోయే సీఎం ఎవరని మణిపూర్ బీజేపీ (Manipur BJP) సీనియర్ ఎమ్మెల్యే వై ఖేమ్‌చంద్ (Y Khemchand) ను మీడియా ప్రశ్నంచగా ఆయన స్పందించారు.
మణిపూర్ కొత్త సీఎం ఎవరనే విషయంలో పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని ఖేమ్‌చంద్ అన్నారు. పార్టీ ఎవరిని సీఎంగా ప్రకటించినా అందరం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. అల్లర్ల సమస్య ముగిసిపోయిందని, ఇప్పుడు తమ ముందున్న ప్రధాన సమస్య రాష్ట్రంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమేనని తెలిపారు. ముఖ్యంగా కుకీ, మైతీ తెగల మధ్య శాంతిని నెలకొల్పాల్సి ఉందని ఆయన చెప్పారు.
అదేవిధంగా మణిపూర్‌లో బీజేపీ ప్రధాన మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు షేక్ నూరుల్ హాసన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని నెలకొల్పడంలో విఫలమైనందుకే తాము బీరేన్ సింగ్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నామని, మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంలో తాము బీజేపీకి సహకరిస్తామని నూరుల్ హాసన్ అన్నారు.
Devendra Fadnavis | వాక్ స్వేచ్ఛ ఉందికదా అని నోరు పారేసుకోవద్దు.. యూట్యూబర్‌కు మహా సీఎం వార్నింగ్
Naresh Mhaske | అది పెళ్లికొడుకు లేని పెళ్లి ఊరేగింపు.. ఇండియా కూటమిపై శివసేన ఎంపీ కామెంట్
Donald Trump | వాటిని ముద్రించడం ఆపండి.. ట్రంప్ మరో కీలక ఆదేశం
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..!
Ayodhya Ram Mandir | ప్రయాగ్‌రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!