శుక్రవారం 10 జూలై 2020
International - Jun 02, 2020 , 09:42:21

జార్జ్ ఫ్లాయిడ్‌ది హ‌త్యే..

జార్జ్ ఫ్లాయిడ్‌ది హ‌త్యే..

హైద‌రాబాద్‌: అమెరికాలోని మిన్నియాపోలీస్‌లో  జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్లజాతీయుడు చ‌నిపోయిన ఘ‌ట‌న‌పై అధికారిక పోస్టుమార్ట‌మ్ నివేదిక రిలీజైంది.  ఫ్లాయిడ్‌ది హోమిసైడ్ అంటూ రిపోర్ట్ ఇచ్చారు. ఉద్దేశపూర్వ‌కంగా ఫ్లాయిడ్‌ను హ‌త్య చేసిన‌ట్లు తేల్చారు. 46 ఏళ్ల ఫ్లాయిడ్‌ను నేల‌పై ప‌డేసి.. అత‌ని గొంతుపై ఓ పోలీసు అధికారి త‌న మోకాలుతో నొక్కి పెట్టాడు.  ఆ స‌మ‌యంలో ఆ న‌ల్ల‌జాతీయుడికి గుండెపోటు వ‌చ్చిన‌ట్లు హెన్నెపిన్ కౌంటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ త‌న‌ పోస్టుమార్ట‌మ్‌లో పేర్కొన్నారు. మెడ‌ను వ‌త్తిపెట్ట‌డం వ‌ల్ల ఫ్లాయిడ్ మ‌ర‌ణించిన‌ట్లు పోస్టుమార్ట‌మ్‌లో తేల్చారు.  ఈ కేసులు పోలీసు ఆఫీస‌ర్ డెరెక్ చౌవిన్‌పై హ‌త్య కేసు న‌మోదు అయ్యింది. వ‌చ్చే వారం అత‌న్ని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. logo