బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
తెల్ల బట్టలను పదే పదే ఉతికినా కొద్దీ వాటి మెరుపు పోయి పసుపు పచ్చగా డల్‌గా అయిపోతుంటాయి. మరి బట్టలు ఎక్కువ కాలం తెల్లగా, తళతళ మెరవాలంటే ఏం చేయాలంటే..
బట్టలపై పడ్డ మరకలను వదిలించడం చాలా కష్టం. ముఖ్యంగా తెల్ల దుస్తులపై పడ్డ మరకలు పోగొట్టడం ఒక సవాలు. ఏ చిన్న మరక పడినా దాన్ని పోగొట్టేందుకు కుస్తీ పట్టాల్సి వస్తుంది. పైగా తెల్ల బట్టలను పదే పదే ఉతికినా కొద్దీ వాటి మెరుపు పోయి పసుపు పచ్చగా డల్‌గా అయిపోతుంటాయి. మరి బట్టలు ఎక్కువ కాలం తెల్లగా, తళతళ మెరవాలంటే ఏం చేయాలి? కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తెల్ల బట్టలపై మరకలను పోగొట్టడమే కాకుండా ఎక్కువ కాలం ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. తెల్ల బట్టలను ఉతికే పద్ధతులు ఒకసారి చూద్దాం..
– తెల్ల బట్టలను విడిగా ఉతకాలి
తెల్ల బట్టలను వీలైనంత వరకు వేరే రంగు దుస్తులతో కలిపి ఉతకకూడదు. అలా చేసినప్పుడు ఆ దుస్తుల రంగు మరకలు తెల్ల బట్టలపై పడే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల తెల్ల బట్టలు డల్‌గా అవుతాయి.
– డిటర్జెంట్ తక్కువ వాడాలి
తెల్ల బట్టలను ఉతికినప్పుడు మంచి డిటర్జెంట్ ఎంపిక చాలా ముఖ్యం. ఎంత డిటర్జెంట్‌లో బట్టలు నానబెడితే మరకలు పోయి బట్టలు అంత తెల్లగా అవుతాయనే చాలామందిలో ఒక అపోహ ఉంది. కానీ అది మంచి పద్ధతి కాదు. డిటర్జెంట్‌ను అతిగా వాడటం వల్ల బట్టలు త్వరగా పాడైపోయే ప్రమాదమే ఎక్కువ.
– వెనిగర్‌తో శుభ్రం చేయాలి
వెనిగర్‌తో బట్టలను శుభ్రం చేస్తే ప్రకాశవంతంగా మెరుస్తాయి. దీనికోసం ముందుగా మరక పడిన చోట వెనిగర్ వేసి రుద్దాలి. ఆ తర్వాత కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఎప్పటిలాగే ఉతికేస్తే సరిపోతుంది. తేడా మీకే కనిపిస్తుంది.
– బ్లీచింగ్‌ను ఉపయోగించాలి
మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్లీచింగ్‌ను కూడా ఉపయోగించవచ్చు. డిటర్జెంట్, బ్లీచింగ్ కలిపిన నీటిలో తెల్ల బట్టలను అరగంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత వేడినీటిలో ఈ బట్టలను శుభ్రం చేయాలి. అప్పుడు తెల్ల బట్టలు తళతళ మెరుస్తాయి.
– వేడి నీటిలో నానబెట్టాలి
తెల్ల బట్టలను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా కూడా త్వరగా మరకలు పోతాయి. వేడి నీటిలో నానబెట్టడం ద్వారా దుస్తులకు అంటుకున్న చెమట, జిడ్డు మరకలు కూడా తొలగిపోతాయి. అయితే మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఆ వేడి నీటిలో డిటర్జెంట్ పౌడర్‌తో పాటు వైట్ వెనిగర్ మిక్స్ చేయాలి. ఆ నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత శుభ్రం చేస్తే దుస్తులు తెల్లగా మెరుస్తాయి.
– నీలిరంగునూ ట్రై చేయొచ్చు
తెల్ల బట్టలను ఉతికిన తర్వాత నీలిరంగు కలిపిన నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా తెల్ల బట్టలు పసుపు పచ్చగా మారవు. అలాగే తెల్ల బట్టలు మరింత తెల్లగా ప్రకాశవంతంగా మారతాయి. డిటర్జెంట్ కలిపిన నీటిలో నీలిరంగను వేసి బట్టలు నానబెట్టి ఆ తర్వాత బట్టలను శుభ్రం చేసినా బట్టలు తెల్లగా అవుతాయి. అయితే నీలిరంగును నేరుగా మరకలపై మాత్రం పోయవద్దు.
– బేకింగ్ సోడా వాడాలి
తెల్లటి దుస్తులను శుభ్రంగా ఉంచేందుకు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసిన నీటిలో బట్టలను నానబెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని రెండుసార్లు అనుసరిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
– నిమ్మరసంతో రుద్దాలి
తెల్ల బట్టలకు అంటుకున్న మరకలు పోగొట్టడంలో నిమ్మరసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బట్టలపై పడ్డ మరకల మీద నిమ్మరసం పోసి ఒక గంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటిలో ఉతకడం ద్వారా తెల్ల బట్టలు కొత్త వాటిలా అవుతాయి.
– ఆలూ జ్యూస్
తెల్ల బట్టలు కొత్త వాటిలా కనిపించడానికి పొటాటో జ్యూస్‌ను కూడా వాడొచ్చు. మరకల మీద పొటాటో రసాన్ని వేసి రుద్దిన తర్వాత డిటర్జెంట్‌లో 20 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి. అప్పుడు బట్టలు కొత్తవాటిలా మెరుస్తాయి.
– తెల్ల బట్టలను ఎండలో కాకుండా నీడపట్టునే ఆరేయాలి. అలాగే బట్టలు ఎండిన తర్వాత ఇస్త్రీ చేసి భద్రపరచుకోవాలి. దీనివల్ల తెల్ల బట్టలు ఎక్కవకాలం కొత్తవిగా ఉంటాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

