శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 19:25:06

చైనా సంగతి తేల్చేందుకు రంగంలోకి టుటు రెజిమెంట్

చైనా సంగతి తేల్చేందుకు రంగంలోకి టుటు రెజిమెంట్

న్యూఢిల్లీ : చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్ టుటు రెజిమంట్ ను రంగంలోకి దించుతున్నది. ఇంటెలిజెన్స్ రెజిమెంట్ గా గుర్తింపు పొందిన ఈ దళం.. సైన్యాధికారికి బదులుగా రా ద్వారా నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది.

ఆగస్టు 29 రాత్రి చైనా సైన్యం మళ్ళీ లడఖ్‌లోకి చొరబడటానికి ప్రయత్నించింది. ఈ చొరబాటులో భారతీయ యువ జవాను అమరవీరుడయ్యాడని బుధవారం వార్తలు వచ్చాయి. టిబెటన్ మూలాలున్న ఈ జవాన్ టుటు రెజిమెంట్ దళాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తున్నది.

2018 అక్టోబర్ లో యూరోపియన్ దేశం ఎస్టోనియాకు చెందిన ప్రసిద్ధ గాయని యానా కాస్క్ మన దేశానికి వచ్చి తన మ్యూజిక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నది. ఇందు కోసం ఆమె ఉత్తరాఖండ్ లోని చక్రత ప్రాంతాన్ని ఎంచుకుంది. చక్రత డెహ్రాడూన్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన కొండ పట్టణం. ఇక్కడే యానా తన స్నేహితులతో షూటింగ్ జరుపుతుండగా.. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ వెంటనే యానా, ఆమె సహచరులను అదుపులోకి తీసుకుని దేశం విడిచి వెళ్ళిపోవాలని నోటీసు ఇచ్చింది. భవిష్యత్తులో భారత్ రాకుండా ఉండటానికి యానాను బ్లాక్ లిస్ట్ చేయమని స్థానిక పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

చక్రత ఒక నిషేధిత ప్రాంతం కాబట్టి ఇదంతా జరిగింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ఏ విదేశీయుడిని ఇక్కడ అనుమతించరు. యానాకు ఈ విషయం తెలియదు. ఆమె ఎటువంటి అనుమతి తీసుకోనందున ఈ చర్యను ఎదుర్కోవలసి వచ్చింది. యానా మాదిరిగా చాలా మంది భారతీయులకు కూడా చక్రత ప్రాంతం నుంచి విదేశీయులు నిషేధించబడ్డారని తెలియదు. చక్రత ఒక కంటోన్మెంట్ ప్రాంతం. ఇది వ్యూహాత్మక దృక్కోణం నుంచి చాలా సున్నితమైనది. విదేశీయులు ఇక్కడికి రావడాన్ని ఆపడానికి అతిపెద్ద కారణం భారత సైన్యం యొక్క అత్యంత రహస్యమైన టుటు రెజిమెంట్ అక్కడ ఉండటమే.

రహస్యంగా పనిచేసే టుటు రెజిమెంట్

టుటు రెజిమెంట్ అనేది భారత సైనిక బలం యొక్క ఒక భాగం. దీని గురించి చాలా తక్కువ సమాచారం బహిరంగంగా లభిస్తుంది. ఈ రెజిమెంట్ ఇప్పటికీ చాలా రహస్యంగా పనిచేస్తుంది. దాని ఉనికికి సంబంధించి ఎటువంటి రుజువు బహిరంగపరచబడలేదు. టుటు రెజిమెంట్ 1962 సంవత్సరంలో స్థాపించబడింది. అదే సమయంలో భారత్- చైనా మధ్య యుద్ధం జరిగింది. అప్పటి ఐబీ చీఫ్ భోలా నాథ్ మాలిక్ సూచన మేరకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. టుటు రెజిమెంట్ ఏర్పాటుకు నిర్ణయించారు.

ఈ రెజిమెంట్ ఏర్పాటు ఉద్దేశం చైనా సరిహద్దులోకి ప్రవేశించి లడఖ్ యొక్క క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులలో పోరాడగల యోధులను సిద్ధం చేయడం. టిబెట్ నుంచి శరణార్థులుగా వచ్చిన యువత కంటే ఈ పనికి ఎవరు సరిరారు. ఇక్కడి ప్రజలు రాళ్లల్లో నడవడం, పర్వతాలు అధిరోహించడం, పరిగెత్తుకుంటూ వెళ్లడం చేస్తుండటం వల్ల టిబెటన్ యువకులను నియమించడానికి టుటు రెజిమెంట్ ను నియమించారు. రిటైర్డ్ మేజర్ జనరల్ సుజన్ సింగ్‌ ఈ రెజిమెంట్‌కు మొదటి ఐజీగా పని చేశారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో 22 వ మౌంటైన్ రెజిమెంట్‌కు సుజన్ సింగ్ నాయకత్వం వహించారు. కొత్తగా ఏర్పడిన రెజిమెంట్‌ను 'ఎస్టాబ్లిష్‌మెంట్ 22' లేదా టుటు రెజిమెంట్ అని కూడా పిలుస్తారు.


logo