ఆక్సిజన్ పొదుపు కోసం మారుతి సుజుకీ కీలక నిర్ణయం..!
Maruti Suzuki: ఆక్సిజన్ పొదుపు కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దాంతో దాదాపు అన్ని ఆస్పత్రుల్లో బెడ్లతోపాటే ఆక్సిజన్‌కు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కారణంగా పలు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు ఊపిరాడక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ పొదుపు కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది.
ఆస్పత్రుల్లో వైద్య అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచటం కోసం హర్యానాలోని తమ కర్మాగారాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి మారుతి సుజుకీ కంపెనీ ప్రతి రెండేండ్లకు ఒకసారి మెయింటెనెన్స్ షట్‌డౌన్ విధిస్తుంటుంది. ఆ మేరకు వచ్చే జూన్ నెలలో మెయింటెనెన్స్ షట్‌డౌన్ విధించాలని కంపెనీ నిర్ణయించింది.
కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరణ, ఆక్సిజన్ కొరత కారణంగా తమ మెయింటెనెన్స్ షట్‌డౌన్‌ను మే 1 నుంచి 9వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయం చేసింది. తొమ్మిది రోజులపాటు తన కర్మాగారాల్లో మాన్యుఫాక్చరింగ్‌ను నిలిపివేయడంవల్ల ఆక్సిజన్ వినియోగం ఉండదని, దానివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరో కరోనా రోగులకు మేలు జరుగుతుందని ఆ సంస్థ భావిస్తున్నది.
గుజరాత్‌లోని సుజుకి మోటార్ కంపెనీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నదని మారుతీ సుజుకీ సంస్థ తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం కర్మాగారాల్లోని ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు మళ్లించడంలో ప్రభుత్వానికి మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకూ సిద్ధపడాల్సిందే: కేంద్రమంత్రి
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

