గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Jul 12, 2020 , 23:15:17

ముందు జాగ్రత్తే మేలు: ఎమ్మెల్యే కృష్ణారావు

ముందు జాగ్రత్తే మేలు: ఎమ్మెల్యే కృష్ణారావు

కేపీహెచ్‌బీకాలనీ : కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాలనీలు, బస్తీల్లో వైరస్‌ సోకిన వ్యక్తుల పట్ల వివక్షత తగదని అన్నారు. పరిశుభ్రం గా ఉంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రజలను కోరారు. అనుమానితులు ప్రభుత్వం చేపట్టే పరీక్ష కేంద్రాలకు వెళ్లి నిర్ధానణ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం బాలాజీనగర్‌ డివిజన్‌లో ప్రజా సమస్యలపై జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర శాఖల అధికారులతో పాటు ఆయా కాలనీల అధ్యక్ష, కార్యదర్శులతో ఎమ్మెల్యే కృష్ణారావు టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించినందుకు పలు కాలనీల ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

కరోనా కట్టడికి స్వీయనియంత్రణే మార్గం

కేపీహెచ్‌బీకాలనీ : కరోనా కట్టడికి స్వీయనియంత్రణే మార్గమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ అన్నారు. వైరస్‌ నివారణకు హోమియోపతి మందులను హైదర్‌నగర్‌ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరుణ్‌కుమార్‌, కృష్ణవేణి, ఎల్లేశ్‌, బాలకృష్ణ, మనోహర్‌గౌడ్‌, వెంకట్‌, దశరథం, రత్నంరాజు, శ్రీనివాస్‌సాగర్‌, అనీల్‌, నరేశ్‌, వెంకటేశ్‌గుప్తా, సునీల్‌, చంద్రమోహన్‌, బద్రినాథ్‌, నర్సింగ్‌, భాగ్యలక్ష్మి, జ్యోతి, సుశాంత, సునీత తదితరులు పాల్గొన్నారు.