మన్సూరాబాద్ : అడ్డగోలు హామీలు గుప్పిస్తూ, ప్రజలను వంచిస్తూ జాతిపిత పేరుకు అవమానం కలిగిస్తున్న రాహుల్ గాంధీ తన పేరు చివరన ఉన్న గాంధీ అనే పదాన్ని తొలగించుకోవాలని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్‌రెడ్డి అన్నారు. సాధ్యం కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడాన్ని నిరసిస్తూ గురువారం నాగోల్ చౌరస్తాలోని మహాత్మగాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా వై సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతిపిత పేరును కాంగ్రెస్ పార్టీ పాడు చేస్తున్నదని, పేరు చివరలో గాంధీ పేరు పెట్టుకుని పూర్తిగా అబద్దాలకే పరిమితమై మహాత్మడికి చెడ్డపేరు తెస్తున్నదని విమర్శించారు. ఎన్నికలకు ముందు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో 420 హామీలిచ్చి 420 రోజులు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారై అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు.
రైతుబంధు, రైతు బీమాలు ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మిని నిలిపివేయడమే కాకుండా ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బస్సుల సంఖ్యను పెంచకుండా ఉన్న బస్సులను తొలగించి ఉచిత ప్రయాణం పేరిట మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు సతీష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
VISA rules | భారత ఐటీ నిపుణులకు శుభవార్త.. న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో సడలింపు
Salwan Momika | 2023లో ముస్లిం దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన వ్యక్తి దారుణ హత్య..!
Congress MP | మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
Chandigarh Mayor | చండీగఢ్ నూతన మేయర్‌గా హర్‌ప్రీత్ కౌర్ బబ్లా.. Video
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు